ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం సాయం రూ.8514.16 కోట్లు

పోలవరం ప్రాజెక్టు కోసం 2014 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు రూ.8514.16 కోట్లు కేంద్ర సాయంగా విడుదలయ్యాయని జల్‌శక్తి శాఖ పేర్కొంది. మిషన్‌ సోలార్‌చక్రలో భాగంగా ఏపీకి పది ప్రాజెక్టులు కేటాయించినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.

పోలవరం సాయం రూ.8514.16 కోట్లు
పోలవరం సాయం రూ.8514.16 కోట్లు

By

Published : Mar 17, 2020, 6:15 AM IST

పోలవరం ప్రాజెక్టు కోసం 2014 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు రూ.8514.16 కోట్లు కేంద్ర సాయంగా విడుదలయ్యాయని జల్‌శక్తి శాఖ పేర్కొంది. కాంగ్రెస్‌ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రతన్‌లాల్‌ కటారియా రాజ్యసభలో సమాధానమిచ్చారు. మిషన్‌ సోలార్‌చక్రలో భాగంగా ఏపీకి పది ప్రాజెక్టులు కేటాయించినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

పోలవరం 6ఏ ప్యాకేజీకి రివర్స్ టెండర్లు

పోలవరం ఎడమ కాలువలో 6(ఏ) ప్యాకేజీ కింద ప్రస్తుతం పనులు చేస్తున్న గుత్తేదారు ఏజేన్సీ నుంచి ఆ పనిని తొలగించి రివర్స్ టెండర్ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్​ పోలవరం చీఫ్​ ఇంజనీర్​కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి:'2021 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తవుతుంది'

ABOUT THE AUTHOR

...view details