ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు - Sri Ramanavami

రాష్ట్ర ప్రజలకు ప్రముఖులు శ్రీరామనవమి పర్విదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం, దైవిక సూత్రాలకు అనుగుణంగా మానవులు తమ జీవితాన్ని ఎలా సార్ధకం చేసుకోవాలన్న విషయాన్ని శ్రీరాముడు తన జీవనం ద్వారా మనకు బోధించాడని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.

Sri Ramanavami
Sri Ramanavami

By

Published : Apr 10, 2022, 4:57 AM IST

రాష్ట్ర ప్రజలకు ప్రముఖులు శ్రీరామనవమి పర్విదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం, దైవిక సూత్రాలకు అనుగుణంగా మానవులు తమ జీవితాన్ని ఎలా సార్ధకం చేసుకోవాలన్న విషయాన్ని శ్రీరాముడు తన జీవనం ద్వారా మనకు బోధించాడని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శ్రీ రాముడు కరుణ, సౌమ్యత, దయ, నీతి, చిత్తశుద్ధిల స్వరూపంగా నిలుస్తాడన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.

ధర్మబద్ధమైన ఆదర్శ జీవితానికి, ప్రజాభీష్ట పాలనకు శ్రీరాముడే మార్గదర్శి అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కష్టసుఖాలు రెండింటిలోనూ నియమం తప్పని రాముడు, ప్రజల మనసెరిగి పాలించాడు కాబట్టే ఈనాటికీ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నాని వెల్లడించారు. శ్రీరామనవమి పర్వదినం తెలుగువారందరికీ ఆయురారోగ్య ఐశ్యర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు.

ఇదీ చదవండి:TTD: సర్వదర్శన టోకెన్లకు పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లలో బారులు

ABOUT THE AUTHOR

...view details