ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GOVERNOR CONDOLANCE: లత మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు: గవర్నర్ బిశ్వభూషణ్ - Lata Mangeshkar's death

లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని.. గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు.

లత మంగేష్కర్
లత మంగేష్కర్

By

Published : Feb 6, 2022, 11:33 AM IST

Updated : Feb 6, 2022, 12:45 PM IST

GOVERNOR CONDOLANCE: లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని.. గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. లతా మంగేష్కర్ క్వీన్ ఆఫ్ మెలోడీ, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందారని గవర్నర్ కొనియాడారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన కృషిని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయన్నారు. లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సీఎం సంతాపం...

లతా మంగేష్కర్‌ మృతిపట్ల సీఎం జగన్‌ సంతాపం తెలిపారు. లత మధుర స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు.

లతా మంగేష్కర్ మృతి విచారకరం: చంద్రబాబు

గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. కోట్ల మందిని తన గాత్రంతో అలరించిన లతా మంగేష్కర్ మృతి విచారకరమని అన్నారు. ఇండియన్ నైటింగేల్ అస్తమయం సంగీత ప్రపంచానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. సంగీత ప్రియుల గుండెల్లో లత స్థానం పదిలమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు లోకేష్ అన్నారు. గానకోకిల లతా మంగేష్కర్ మృతి బాధాకరమని అచ్చెన్నాయుడు అన్నారు. లత ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

లత మంగేష్కర్ పాటలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి: సోమువీర్రాజు

భారతరత్న...గానకోకిల... లతా మంగేష్కర్ మృతి చెందడంపట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగులోనూ లతా మంగేష్కర్‌ పాడిన పాటలు ఇప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావు కరాడ.. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, ఎమ్మెల్సీలు మాదవ్‌, వాకాటి నారాయణరెడ్డి తదితరులు లతా మంగేష్కర్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి:లతా మంగేష్కర్​ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

Last Updated : Feb 6, 2022, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details