ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ceew report: వాతావరణ దుర్బలత్వ సూచీలో ఏపీ రెండోస్థానం..!

ceew report: రాష్ట్రంలో తుపాన్లు, కరవు, వరదల ప్రభావం అధికంగా ఉందని సీఈఈడబ్ల్యూ తెలిపింది. వాతావరణ దుర్బలత్వ సూచీలో రెండోస్థానంలో ఉందని పేర్కొంది.

ceew-report-on-loods-and-drought-effect-on-ap
వాతావరణ దుర్బలత్వ సూచీలో రెండోస్థానం

By

Published : Dec 3, 2021, 7:49 AM IST

ceew report on floods and drought: వరదలు, కరవు, తుపాన్ల తాకిడికి గురయ్యే అత్యంత వాతావరణ దుర్బలత్వ రాష్ట్రాల్లో అసోం, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 110 జిల్లాల్లో విపత్తుల ప్రభావం అత్యధికంగా, అధికంగా ఉన్నట్లు గుర్తించగా.. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎనిమిది జిల్లాలు ఉండటం గమనార్హం. ఇంధన, పర్యావరణ, జల మండలి(సీఈఈడబ్ల్యూ) రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

దేశంలోనే విజయనగరం నాలుగో స్థానం

దేశవ్యాప్తంగా అత్యధిక వాతావరణ దుర్బలత్వ పరిస్థితులున్న తొలి 20 జిల్లాల్లో అసోంలోని ధేమాజి మొదటి, తెలంగాణలోని ఖమ్మం (వరదలు, కరవు) రెండో, ఒడిశాలోని గజపతి(వరదలు, కరవు, తుపాన్లు) మూడు, ఏపీలోని విజయనగరం(వరదలు, కరవు) నాలుగో స్థానంలో ఉన్నాయి. మొత్తంగా దేశంలో 50 జిల్లాల్లో వాతావరణ దుర్బలత్వ తీవ్రత అత్యధికంగా ఉంటుందని నివేదికలో గుర్తించగా... అందులో విజయనగరం, పశ్చిమ గోదావరి, గుంటూరు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలున్నాయి.

  • దేశంలో తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉండే తొలి 20 జిల్లాల్లో నెల్లూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలు 10 నుంచి 13 స్థానాల్లో ఉండగా గుంటూరు 15వ స్థానంలో, పశ్చిమ గోదావరి జిల్లా 19వ స్థానంలో ఉన్నాయి. కరవు తీవ్రత ఎక్కువగా ఉండే 20 జిల్లాల్లో అనంతపురం రెండోస్థానం, చిత్తూరు జిల్లా 13 స్థానంలో నిలిచాయి. వరదల తీవ్రత అధికంగా ఉండే 20 జిల్లాల్లో పశ్చిమగోదావరి 19వ స్థానంలో ఉంది.

కరవు ప్రభావిత జిల్లాలపై.. తుపాన్ల కన్నెర్ర:కరవు బారిన పడే జిల్లాలపైనే.. తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దక్షిణాదిన తుపాన్లలకు హాట్‌స్పాట్లుగా గుర్తించిన 14 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విజయనగరం, పశ్చిమగోదావరి, కడప, గుంటూరు. నెల్లూరు జిల్లాలున్నాయి.

  • వివిధ జిల్లాలు ఒకటికి మించి విపత్తులను ఎదుర్కొంటున్నాయి. ఇందులో ఏపీ నుంచి గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు ముప్పేటదాడిని ఎదుర్కొంటున్నాయి. బిహార్‌లోని దర్భంగా, ఒడిశాలోని గజపతి, గంజాం, నయాగర్‌ జిల్లాల్లోనూ ఇదేరకమైన పరిస్థితులున్నాయి.
  • దేశంలోనే అత్యధిక వరద ప్రభావిత ప్రాంతాలుగా.. దక్షిణాది జోన్‌లో 9 జిల్లాలను గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి, కడప, చిత్తూరు ఉన్నాయి.
  • దక్షిణాది జోన్‌లోని 17 కరవు ప్రభావిత జిల్లాల్లో విజయనగరం, పశ్చిమగోదావరి, కడప, గుంటూరు, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

ఇదీ చూడండి:

cm jagan tour in kadapa : 'అన్ని విధాలా ఆదుకుంటాం...వరద బాధితులకు సీఎం భరోసా'

ABOUT THE AUTHOR

...view details