Telugu Academy: తెలుగు అకాడమీ కేసు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చంచల్ గూడ జైల్లో ఉన్న ఆరుగురు నిందితులను పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించగా.. ఇవాళ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
Accused into custody: చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సాయి కుమార్, వెంకట రమణ, సోమశేఖర్, వెంకట్, రమేశ్, సత్యనారాయణలను సీసీఎస్కు తరలించి ప్రశ్నిస్తున్నారు. తెలుగు అకాడమీకి చెందిన 63 కోట్ల రూపాయలను వాటాలుగా పంచుకున్న నిందితులు.. వాటిని ఎక్కడికి మళ్లించారనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ఆస్తుల జప్తు
CCS police: ఇప్పటికే సీసీఎస్ పోలీసులు నిందితులకు సంబంధించిన కొన్ని ఆస్తులను గుర్తించి జప్తు చేశారు. తెలుగు అకాడమీకి చెందిన 63 కోట్ల రూపాయలకు లెక్క తేలకపోవడంతో డిపాజిట్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన నిందితులను సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీళ్లందరూ డబ్బులను వాటాలుగా పంచుకొని పలుచోట్లు పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.