రంగురాళ్లు చోరీ అయ్యాయని జ్యోతిష్యుడు మురళీకృష్ణ శర్మ కేసులో ట్విస్ట్ నెలకొంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులో చూశాయి. బెల్లంకొండ మురళీకృష్ణశర్మ ఇంట్లో భారీగా నగదును పోలీసులు గుర్తించారు. మురళీకృష్ణ శర్మ ఇంట్లో దాదాపు రూ.18 కోట్లు విలువజేసే నకిలీ నోట్లు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.
నకిలీ నోట్లతోపాటు.. మురళీకృష్ణ ఇంట్లో రూ. 6లక్షల 32వేల నగదు సైతం లభ్యమైంది. డబ్బు విషయం దాచి.. రంగురాళ్లు పోయాయని మురళీకృష్ణ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో 90 కోట్ల రూపాయల హవాలా మనీ కేసులో మురళీకృష్ణ జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. జ్యోతిష్యుడితో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశారు.