కరోనా విజృంభనతో అభివృద్ధి చెందిన దేశాలే అతలాకుతలం అవుతున్నాయని.. జనసాంద్రత ఎక్కువగా ఉండే భారత్‌లో వైరస్ కట్టడిని నిరోధించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేషన్ కె.మిశ్రా అన్నారు. లోకల్ ట్రాన్స్మిషన్ పెరుగుతుండటం.. మూడవ దశ ప్రారంభమనే సంకేతాలిస్తున్నాయని.. ఇది చాలా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ వంటి చర్యలు అత్యవసరమని.. ఇందుకు ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. వేసవి, వ్యాక్సిన్‌పై మనం ఆధారపడలేమని... సామాజిక దూరమే విరుగుడని వెల్లడించారు.
వేసవి, వ్యాక్సిన్‌పై ఆధారపడొద్దు..సామాజిక దూరమే మార్గం: సీసీఎంబీ డైరెక్టర్ - latest news on carona
కరోనా నివారణకు వేసవి, వ్యాక్సిన్‌పై ఆధారపడలేమని... సామాజిక దూరం, స్వీయనిర్బంధమే సరైన మందు అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేషన్ కె.మిశ్రా అన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ వచ్చినా ప్రజలకు అందుబాటులోకి రావడానికి నెలల సమయం పడుతుందన్నారు.
![వేసవి, వ్యాక్సిన్‌పై ఆధారపడొద్దు..సామాజిక దూరమే మార్గం: సీసీఎంబీ డైరెక్టర్ ccmd chairman on carona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6571341-1056-6571341-1585404096366.jpg)
కరోనా వైరస్ పై మాట్లాడుతున్న సీసీఎండీ ఛైర్మన్
వేసవి, వ్యాక్సిన్‌పై ఆధారపడొద్దు..సామాజిక దూరమే మార్గం: సీసీఎంబీ డైరెక్టర్
ఇదీ చదవండి: వీరికి కరోనా పరీక్షలు తప్పనిసరి!
Last Updated : Mar 28, 2020, 9:35 PM IST