ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CCMB: కరోనా కొత్త వేరియంట్ వేళ సీసీఎంబీ చర్యలు

ccmb on omicron: దేశంలో ఒమిక్రాన్​ కేసులు బయటపడటంతో సాధ్యమైనంత ఎక్కువ వైరస్​ల జన్యుక్రమాలను కనుగొనడంపై దృష్టి సారించినట్లు సీసీఎంబీ ప్రకటించింది. బెంగళూరు, దిల్లీ, పుణె, హైదరాబాద్ సిటీ క్లస్టర్​లలో వీలైనంత ఎక్కువ శాంపిల్స్​ను జీనోమ్ సీక్వెన్సింగ్​ చేయాలని ఇన్సకాగ్ భావిస్తున్నట్టు సీసీఎంబీ ప్రకటించింది.

ccmb-on-omicron
కరోనా కొత్త వేరియంట్ వేళ సీసీఎంబీ చర్యలు

By

Published : Dec 4, 2021, 9:10 AM IST

ccmb on omicron: కరోనా కొత్త వేరియంట్ కలవరపెడుతున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ సంఖ్యలో శాంపిల్స్​ను జీనోమ్ సీక్వెన్స్ చేయాలని ఇన్సకాగ్ భావిస్తున్నట్టు సీసీఎంబీ ప్రకటించింది. దేశంలో మొట్టమొదటి ఒమిక్రాన్ కేసులను ఎంసీబీఎస్ గుర్తించిన విషయం తెలిసిందే. బెంగళూరు, దిల్లీ, పుణె, హైదరాబాద్ సిటీ క్లస్టర్​లలో జీనోమ్ సీక్వెన్స్ చేసేందుకు నాలుగు నెలల క్రితం ఏర్పడిన నేషనల్ ల్యాబొరేటరీస్ పెర్ఫార్మింగ్ జీనామిక్ సర్వే లైన్సు కన్సార్టియంలో ఎన్​సీబీఎస్ భాగస్వామి కావడం గమనార్హం.

ఈ కన్సార్టియంకి సీసీఎంబీ నేతృత్వం వహిస్తుండటం విశేషం. బెంగళూరు, హైదరాబాద్, పుణె, దిల్లీలో పరిస్థితులను ఈ కన్సార్టియం ఎప్పటికప్పుడు గమనిస్తుందని సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. ఎక్కువ వైరస్​ నమూనాల జన్యుక్రమాలను కనుగొనడంపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఇన్సకాగ్ సహకారంతో ఇప్పటికే జీనోమ్ సీక్వెన్స్​ను పెంచమని తెలిపిన ఆయన... మరింత వేగంగా శాంపిళ్లను పరీక్షించేందుకు కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details