సీసీఎంబీ అనుబంధ సంస్థ..అటల్ ఇంక్యుబేషన్‌లోని అంకుర సంస్థ క్లోన్ డీల్స్ కరోనాను ఎదుర్కొనేందుకు సరికొత్త ప్రయోగం చేసి విజయం సాధించింది. హిమాలయాల్లో లభించే 'కార్డిసెప్స్ మిలిటరీస్' అనే పుట్టగొడుగు కరోనా వైరస్ ఆర్ఎన్ఐ వృద్ధిని నిలిపివేస్తుందని గుర్తించింది. అత్యంత పోషక విలువలు కలిగిన ఈ పుట్టగొడుగు పొడి.. పసుపులోని కర్కమిన్‌తో కలిపి ద్రవరూపంలో కరోనా ఎయిడ్‌ను తయారు చేశారు.
ఏఐసీలో జరిగిన సమావేశంలో సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ కే మిశ్రా కరోనా ఎయిడ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఐసీ సీఈఓ డాక్టర్ మధుసూదన రావు, క్లోన్ డీల్స్ సంస్థ నుంచి డాక్టర్ పందెం అయోధ్య ప్రకాశ్ , అతిక్ పటేల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.