వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను రష్యా సంపూర్ణంగా నిర్వహించలేదని, టీకా తయారీలో మూడో దశ ట్రయల్స్ ఎంతో కీలకమని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా స్పష్టం చేశారు. ఈ దశలో ఎక్కువ మందిపై టీకాను పరీక్షించి.. వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందో లేదో 2 నెలలపాటు వేచి చూడాల్సి ఉందన్నారు. రష్యా భారీగా పరీక్షలు నిర్వహించినట్లు కనిపించలేదని, ఒకవేళ చేసి ఉంటే ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచనవసరం లేదన్నారు. ఈ టీకా ఎంత వరకూ సురక్షితమో తెలియదని.. సాధారణంగా ఏ దేశంలోనైనా 1, 2, 3 దశల్లో విజయవంతమైతేనే దాన్ని అనుమతించాలని ఆయన వివరించారు. టీకా తయారీని వేగవంతం చేసేందుకు రష్యా కొన్ని నెలల క్రితం చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు.
అసలు పరీక్ష మూడో దశలోనే...