ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు - కరోనా

కొవిడ్ ఆస్పత్రుల్లో అందుతున్న సేవలను పర్యవేక్షించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల వినియోగంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని 138 ఆసుపత్రుల్లో ఉన్న సీసీ కెమెరాలను రాష్ట్ర కొవిడ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభమైంది

cc cameras
cc cameras

By

Published : Aug 25, 2020, 12:45 AM IST

కొవిడ్ ఆసుపత్రుల్లో పర్యవేక్షణ చేసేందుకు అధికారులు సీసీ కెమెరాల వినియోగంపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని 138 ఆసుపత్రుల్లో ఉన్న సీసీ కెమెరాలను రాష్ట్ర కొవిడ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభమైంది.

తొలివిడత కింద 101 కొవిడ్ ఆసుపత్రుల్లో సుమారు 800 సీసీ కెమెరాలు అమర్చారు. వీటిని ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్ ఛాంబర్లు, విజయవాడలోని స్టేట్ కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు . మలివిడత కింద మరో 29 ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇందులో ప్రైవేట్ ఆసుపత్రులు 16 వరకూ ఉన్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్న వారికి మెరుగైన సేవలు అందించే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు .

ABOUT THE AUTHOR

...view details