ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

28 మంది ఎంపీలు ఉండి 32 నెలల్లో ఏం చేశారు: చంద్రబాబు - chandrababu latest news

తెదేపా ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రాబాబు ఆన్​లైన్ సమావేశం నిర్వహించారు. ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి పోతోందని.. ఈ పరిణామాలపై కేంద్రం స్పందించాలన్నారు. పాలన అంటే అప్పులు చేయడం, దోచుకోవడం కాదని వైకాపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

cbn with tdp mps
cbn with tdp mps

By

Published : Jan 28, 2022, 5:48 PM IST

రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి పోతోందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు ఆన్‌లైన్‌లో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. వైకాపాకు 28 మంది ఎంపీలు ఉండి 32 నెలల్లో రాష్ట్రానికి ఏం తెచ్చారని నిలదీశారు. పాలన అంటే అప్పులు చేయడం, దోచుకోవడం అన్నట్లుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలు, రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై.. కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే.. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలు అంటూ వైకాపా ప్రభుత్వం కొత్త డ్రామా నడుపుతోందని మండిపడ్డారు. ఉద్యోగుల పీఆర్సీతో పాటు రాష్ట్రంలోని ఇతర సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ డ్రామా అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ దీల్లీ పర్యటనలు ఎవరి కోసమని చంద్రబాబు నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు, విభజన హామీలు, పెండింగ్ అంశాలపై తెదేపా పోరాటం కొనసాగించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details