తెలంగాణ రాష్ట్రం ములుగు ఎమ్మెల్యే సీతక్కకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని ములుగు నియోజకవర్గ అభివృద్ధికి సీతక్క చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. ఇదే స్ఫూర్తి కొనసాగించి ఉన్నత శిఖరాలకు చేరాలని అభిలాషిస్తున్నట్లు తెలిపారు. భగవంతుడు ఆమెకు మరింత శక్తి, ఆరోగ్యం ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ఎమ్మెల్యే సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తేదేపా అధినేత - tdp leader chandrababu latest news
తెలంగాణలోని ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్కకు ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెదేపా అధినేత