పీపీఏల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి తప్పుబట్టారు. కేంద్ర చివాట్లు, కోర్టులు మెుట్టికాయలు పెట్టినా.. వైకాపా వాళ్లు పెడచెవిన పెట్టారంటూ విమర్శించారు. తాజాగా పీపీఏల రద్దుపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై.. చంద్రబాబు స్పందించారు. మూడు కంపెనీలకు తెదేపా ప్రభుత్వం దోచిపెట్టిందన్న వైకాపా నేతల ఆరోపణలన్నీ అవాస్తవాలేనని రుజువులతో సహా ఆ లేఖలో తెలిపారని పేర్కొన్నారు. జీవో 63ని హైకోర్టు కొట్టివేయటం ఒక చెంపపెట్టు అయితే... కేంద్రమంత్రి లేఖ మరో చెంపపెట్టు అని ట్వీట్ చేశారు.
కేంద్ర మంత్రి లేఖ.. ప్రభుత్వానికి చెంపపెట్టు: చంద్రబాబు - పీపీఏల రద్దుపై చంద్రబాబు
పీపీఏల రద్దు వ్యవహారంపై తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ లేఖతో... మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తీరు బయటపడిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కేంద్రం, కోర్టులు చివాట్లు పెట్టినా... వైకాపా వాళ్లు పెడచెవిన పెట్టారంటూ ట్వీట్ చేశారు.
![కేంద్ర మంత్రి లేఖ.. ప్రభుత్వానికి చెంపపెట్టు: చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4553091-202-4553091-1569424196310.jpg)
cbn twwets on central minister leetet om PPAs
Last Updated : Sep 26, 2019, 9:37 AM IST