కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల్లో కొందరు పోలీసులు.. బెదిరింపులకు దిగడం అత్యంత హేయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తమ పార్టీ సానుభూతిపరులు వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. సింహాద్రిపురం మండలం నంద్యాలపల్లి పంచాయతీలో సోమశేఖర్‌రెడ్డి సహా తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారన్నారు. తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా దుర్మార్గులకు అండగా నిలిచేవారిని ప్రజలు సహించరని చంద్రబాబు హెచ్చరించారు.
'నామినేషన్ల ఉపసంహరణకు పోలీసుల బెదిరింపులు దుర్మార్గం' - తెదేపా అధినేత చంద్రబాబు ఫైర్
నామినేషన్ల ఉపసంహరణకు పోలీసుల బెదిరింపులు దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ఆదేశాలతో కొందరు పోలీసులు బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఐ అనిల్‌రెడ్డి వైకాపా కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
CBN