క్యాసినో వ్యవహారం, ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రక్రియ చేపట్టారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ప్రక్రియను నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జిల్లాల ప్రక్రియ కొనసాగుతోందని నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా తెలుగుదేశం మాత్రం స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకునే వరకు గుడివాడ క్యాసినో వ్యవహారంలో పోరాటం ఉద్ధృతం చేయాలని ఆదేశించారు.
క్యాసినో వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రకటన: చంద్రబాబు - క్యాసినోపై చంద్రబాబు
ఉద్యోగుల సమస్యలు, క్యాసినో వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రక్రియ తెరపైకి తెచ్చారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
cbn on new district statement