బహుముఖ ప్రజ్ఞాశాలి కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడిగా చరిత్రలో నిలిచిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు అని ఆయన కొనియడారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించారన్నారు. స్త్రీలు బయటకు వెళ్లి చదువుకోలేని రోజుల్లోనే బాలికా పాఠశాల ప్రారంభించారని వివరించారు.
సమాజ అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి వీరేశలింగం: చంద్రబాబు - cbn on veereshalingam jayanthi
కందుకూరి వీరెేశలింగం జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడి వితంతు వివాహాలు జరిపించారన్నారు.
పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు అందిస్తూ చదువుల్లో రాణించేందుకు అన్ని విధాలుగా ప్రోత్సహించారని గుర్తు చేశారు. మూఢ నమ్మకాలను పారద్రోలడంతో పాటు మహిళోద్దరణకు కందుకూరి విశేషంగా కృషి చేశారని చంద్రబాబు తెలిపారు. కందుకూరి వీరేశలింగం సతీమణి కందుకూరి రాజ్యలక్ష్మి అందించిన తోడ్పాటుతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడి వితంతు వివాహాలు జరిపించారన్నారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయ్యాయని చంద్రబాబు తెలిపారు.
ఇదీ చదవండి:పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలపై నిర్ణయం: మంత్రి సురేశ్