Chandrababu Political Journey: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గత స్మృతులను నెమరవేసుకున్నారు. 44 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 25న చంద్రబాబు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు..తన ప్రత్యర్ధి కొంగర పట్టాభిరామ చౌదరిపై గెలుపొందారు. ప్రజాప్రతినిధిగా 44 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితంలో ముఖ్యమైన సందర్భం ఏది అని పార్టీ నేతలు చంద్రబాబును ప్రశ్నించగా..అలా అని ప్రత్యేకంగా ఏదీ చెప్పలేను. పని చేయాలి..సాధించాలనే తపన మాత్రం ఇప్పటికీ తగ్గలేదని ఆయన సమాధానమిచ్చారు. పలువురు నేతలు అధినేత ప్రస్థానంపై పాత విషయాలు గుర్తు చేయగా..తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంపై చంద్రబాబు మాట్లాడారు.
‘నాడు విశ్వవిద్యాలయ విద్యార్థులుగా గ్రామాలకు వెళితే ఎంతో ఆదరణ ఉండేది. నేను యూనివర్సిటీ లీడర్‌గా ఎదిగి తర్వాత అసెంబ్లీకి పోటీ చేశా. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నాకు మంత్రి పదవి కావాలని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని అడిగితే...ఏంటి ఇంత దూకుడుగా ఉన్నావ్.. తొలిసారి ఎమ్మెల్యేవి..అప్పుడే మంత్రి పదవి కావాలా అని ప్రశ్నించారు. ఆ తర్వాత అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా అవకాశం వచ్చింది. ఓ సందర్భంలో పూర్తిగా వ్యాపారం వైపు వెళ్లాలనే ఆలోచన కూడా చేశా. అయితే అప్పటి పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోనే కొనసాగా. నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ని కలిశా. అప్పుడు ఆయన ఓ షూటింగ్‌లో వరుడు వేషంతో ఉన్నారు’ అని నేతలకు వివరించారు.
బాబు చెబితే అది కరెక్టే అని వాజ్‌పేయీ అనేవారు...