మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో పల్నాటి ప్రజలకు, తెలుగుదేశం పార్టీకి అన్నివేళలా అండగా నిలిచిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. అందుకే ప్రజలు ఆయనను పల్నాటి పులి అని పిలిచారని గుర్తుచేశారు. కోడెల శివప్రసాదరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు.
కోడెలకు చంద్రబాబు, లోకేశ్ నివాళులు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ద్వితియ వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళి అర్పించారు. ఆయన సేవలకు గుర్తు చేసుకున్నారు.
కోడెలకు చంద్రబాబు, లోకేశ్ నివాళులు
కోడెలను భౌతికంగా లేకుండా చేశారు.. కానీ పల్నాటి ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పుడూ పదిలంగా ఉంటుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఉన్మాద పాలకుల కక్షలు, కుట్రల కారణంగా శివప్రసాదరావు దూరమై రెండేళ్లు గడిచిందన్నారు. కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రెండోసారి టెండరు ప్రకటనకూ స్పందన కరవు