తమిళనాడులో చిక్కుకున్న తెలుగువారిని కాపాడాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడివిడిగా లేఖలు రాశారు. చెన్నై, ఈరోడ్, తిరుపూర్, కాంచీపురం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 2 వేల మంది మత్స్యకారులు, ఉపాధి కూలీలు చిక్కుకున్నారని లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దాదాపు వెయ్యి మంది జాలర్లు చెన్నై వద్ద ఆహారం లభించక అలమటిస్తున్నారని ఇరువురి దృష్టికి తీసుకెళ్లారు. ఆహారం దొరక్క తీవ్ర సమస్యలు ఎదుర్కోవడమే కాక.. సొంత రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇచ్చే సాయాన్ని కోల్పోతున్నారని లేఖలో పేర్కొన్నారు. వారందరినీ తిరిగి స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతవరకూ తమిళనాడులో వారికి వసతి, ఆహారం, వైద్య సదుపాయాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
'తమిళనాడులో చిక్కుకున్న తెలుగువారిని స్వస్థలాలకు పంపండి' - తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ
తమిళనాడులో చిక్కుకున్న తెలుగువారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు తమిళనాడు సీఎం, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. ఏపీకి చెందిన సుమారు 2 వేల మంది తమిళనాడులో చిక్కుకున్నారని లేఖలో పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల ఆహారం దొరక్క తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి సాయం అందించాలని కోరారు.
తమిళనాడు సీఎం, కేంద్ర హోంశాఖలకు చంద్రబాబు లేఖలు