ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్య చీలిక తెచ్చి స్వార్థ ప్రయోజనాలు పొందడమే జగన్ నైజమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజలెవరూ ఆ బూటకపు మాటల్ని నమ్మి మోసపోవద్దంటూ రాజధాని రైతులు గట్టిగా చెబుతున్నారన్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన ఓ రైతు ఆవేదనకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ల్యాండ్‌పూలింగ్‌కు సంబంధించి జగన్ ఎన్నికలకు ముందు ఓ మాట... ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని ఆ వీడియోలో రైతు ఆరోపించారు. ఒక రాజకీయ నాయకుడు ఇలా ప్రజల్లో విశ్వసనీయత పోగొట్టుకోవడం సిగ్గుచేటని చంద్రబాబు విమర్శించారు.
'ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్య చీలికే జగన్ లక్ష్యం' - సీఎం జగన్ వార్తలు
సీఎం జగన్‌పై ట్విటర్ వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఓ రాజకీయ నాయకుడు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోవడం సిగ్గుచేటని విమర్శించారు.
cbn fires on jagan over amaravati issue