ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN Condolence: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి.. చంద్రబాబు దిగ్బ్రాంతి - జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిపట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

CBN Condolence: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అబేపై దాడి ఘటన షాక్ కు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటించారు.

CBN Condolences to  JAPAN FORMER PM SHINZO ABE
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిపట్ల చంద్రబాబు విచారం

By

Published : Jul 8, 2022, 5:15 PM IST

CBN Condolence: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అబేపై దాడి ఘటన షాక్ కు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషాదం నుంచి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటించారు.

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) హత్యకు గురయ్యారు. శుక్రవారం దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రాణాలు విడిచినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. పార్లమెంట్​ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అబే ఒక్కసారిగా ఛాతీపై చేయి పెట్టుకొని కుప్పకూలిపోయారు. తీవ్ర రక్తస్రావమైంది. ఎలాంటి కదలికలు లేని ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అబే శ్వాస తీసుకోవడం లేదని, గుండె కూడా చలనం లేదని తెలిసింది. ఆయన కార్డియో పల్మనరీ అరెస్టు పరిస్థితిలో ఉన్నారని టోక్యో మాజీ గవర్నర్‌ కాసేపటికి వెల్లడించారు. అనేక గంటల తర్వాత.. అబే మరణించారన్న వార్తను అక్కడి మీడియా ధ్రువీకరించింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details