రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రులందరిదీ ఒకే మాట, ఒకే రాజధాని అని చాటాలని కోరారు. విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా ప్రణాళికాబద్ధమైన ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించుకునే అవకాశం వచ్చిందని చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి సంపద సృష్టి కేంద్రంగా నిర్మించాలనుకున్నామని స్పష్టం చేశారు.
'అమరావతి కోసం రాష్ట్ర ప్రజలందరూ పోరాడాలి' - అమరావతి ఉద్యమం తాజా వార్తలు
రాష్ట్ర ప్రజల భవిష్యత్‌తో ప్రభుత్వం ముడుముక్కలాట ఆడుకుంటోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రులందరిదీ ఒకే మాట, ఒకే రాజధాని అని చాటాలని చంద్రబాబు అన్నారు.
cbn call to andhra people to protest for amaravathi
వైకాపా ప్రభుత్వం ఆడుతున్న మూడు ముక్కలాటకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చంద్రబాబు అన్నారు. ఉద్యమించకపోతే రేపటి తరాలకు కలిగే నష్టాలకు మనమే బాధ్యులమవుతామని పేర్కొన్నారు. అద్భుత రాజధాని అమరావతి నగరాన్ని ఈరోజు శిధిల స్థితిలో చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు
ఇదీ చదవండి: దిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన సీఎం జగన్