చంద్రబాబు జన్మదినోత్సవం సందర్శంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా చంద్రబాబు నగర్ ప్రజలకు దేవినేని ఉమ ఆధ్వర్యంలో కూరగాయలు, కోడి గుడ్లు పంపిణీ చేశారు. రెడ్డిగూడెంలో కేశినేని నాని స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ 200 నిరుపేద కుటుంబాలకు ఆహారం అందించారు. గద్దె అనురాధ పాయసం తయారు చేసి, పోలీసులకు, శానిటరీ సిబ్బంది, వలస కూలీలకు అందజేశారు. విజయవాడలో దేవినేని అపర్ణ సుమారు 4వందల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా కొలనుకొండలో తెదేపా నేతలు కేక్ కట్ చేశారు. పేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.
చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు - చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదినోత్సవం పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ పేదలకు ఆహారం , నిత్యావసర సరుకులు అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లమిల్లి, కాకినాడలో పేదలకు నిత్యావసరాలు, ఆహారం అందించారు. అనంతపురంలో పేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా మేడికొండూరు పేదలకు కూరగాయలు అందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు, గర్భిణీలకు పండ్లు పంపిణీ చేశారు. విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్.. సుమారు 25 మంది నిరుపేద కుటుంబాలకు 2వేలు చొప్పున అందజేశారు. నర్సీపట్నంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. తిరుపతి,ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పేదలకు నిత్యావసరాలు అందజేశారు.
ఇవీ చదవండి:కరోనా తర్వాత భారత్ 'లెవల్' మారిపోతుంది!