ప్రముఖ సాహిత్య కళాకారులు కె.సి.శివశంకరన్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సంతాపం తెలిపారు. శివశంకరన్ మరణం సాహిత్యలోకానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాలల సాహిత్య సంచిక చందమామలో విక్రమార్క - బేతాళ కథలకు చిత్రరూపాన్ని ఇచ్చి "అంబులి మామ"గా ప్రసిద్ధిచెందిన విలక్షణ చిత్రకారుడని చంద్రబాబు కొనియాడారు. శివశంకరన్ చిత్రలేఖా నైపుణ్యం అద్వితీయమని పేర్కొన్నారు. నాగిరెడ్డి సంపాదకీయానికి, శంకర్ చిత్రాలు తోడై చందమామ సంచికను మరోస్థాయికి చేర్చాయని చెప్పారు. ఆ మహానుభావుని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
బాలసాహిత్య ప్రపంచానికి తీరనిలోటు