అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నేడు మరోసారి విచారణ జరగనుంది. ఈనెల 8న జగన్, రఘురామ కృష్ణరాజు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించారు. సీబీఐ మాత్రం వాదించేది ఏదీ లేదని.. పిటిషన్ లోని అంశాలను చట్టపరిధిలో, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని... కోర్టును కోరింది. జగన్ వాదనలపై సమాధానాలు ఇచ్చేందుకు రఘురామ కృష్ణ రాజు తరఫు న్యాయవాది సమయం కోరడంతో నేటికి వాయిదా పడింది. పిటిషన్ పై ఇవాళ వాదనలు ముగిసే అవకాశం ఉంది.
నేడు జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ - రఘురామ రాజు పిటిషన్ విచారణ
సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఈనెల 8న జగన్, రఘురామ కృష్ణరాజు తమ వాదనలను లిఖిత పూర్వకంగా సమర్పించారు.
jagan bail