ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Punch Prabhakar case: జడ్జీలపై సోషల్ మీడియాలో పోస్టుల కేసు.. పిటిషనర్లకు సీబీఐ అఫిడవిట్

జడ్జీలపై సోషల్ మీడియాలో పోస్టుల కేసులో.. సీబీఐ అఫిడవిట్​ను పిటిషనర్లకు (CBI On Punch Prabhakar case) పంపింది. పంచ్ ప్రభాకర్​పై నవంబర్ 1న లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించిన సీబీఐ.. ఆయన అరెస్టుకు నవంబర్ 8న వారెంట్ తీసుకున్నట్లు పేర్కొంది.

జడ్జీలపై సోషల్ మీడియాలో పోస్టుల కేసు.. పిటిషనర్లకు సీబీఐ అఫిడవిట్
జడ్జీలపై సోషల్ మీడియాలో పోస్టుల కేసు.. పిటిషనర్లకు సీబీఐ అఫిడవిట్

By

Published : Nov 25, 2021, 3:18 PM IST

Updated : Nov 25, 2021, 5:08 PM IST

న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల కేసులో అఫిడవిట్‌ను సీబీఐ (Punch Prabhakar case latest news) పిటిషనర్లకు పంపింది. ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్​ను తాజాగా.. పిటిషనర్లకు అందజేసింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పంచ్‌ ప్రభాకర్‌పై నవంబర్ 1న లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు సీబీఐ పేర్కొంది. పంచ్ ప్రభాకర్ అరెస్టుకు నవంబర్‌ 8న వారెంట్ తీసుకున్నట్లు వివరించింది.

ప్రభాకర్ అరెస్టుకు సహకరించాలని ఈ నెల 9న ఇంటర్ పోల్‌కు విజ్ఞప్తి చేసినట్లు అఫిడవిట్​లో సీబీఐ వెల్లడించింది. ఈ అంశంపై ఇంటర్ పోల్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అలాగే జడ్జిలపై పోస్టులు తొలగించడంపై ఈ నెల 15న యూట్యూబ్‌తో మాట్లాడామని చెప్పింది. కేసుకు సంబంధం ఉన్న అందరినీ విచారిస్తున్నామన్న సీబీఐ.. ఇందులో పంచ్‌ ప్రభాకర్‌ను 17వ నిందితుడిగా చేర్చినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

case registered: తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనితపై కేసు నమోదు

Last Updated : Nov 25, 2021, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details