అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ-గృహ నిర్మాణ మండలికి చెందిన కేసుల్లో ప్రధాన నిందితులైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లలో కౌంటరు దాఖలు చేయడానికి మరికొంత గడువు కావాలని సీబీఐ బుధవారం సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో జగన్, విజయసాయిరెడ్డిలతోపాటు లేపాక్షి ఎండీ శ్రీనివాస బాలాజీ, ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్యలు డిశ్ఛార్జి పిటిషన్‌లు దాఖలు చేశారు. దీనికి అనుమతించిన సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. దీంతోపాటు ఇందూ-గృహనిర్మాణ మండలి కేసులోనూ కౌంటరుకు గడువు ఇస్తూ 27కి వాయిదా వేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన రాంకీ కేసును 27కి, ఇండియా సిమెంట్స్ కేసును 28కి వాయిదా వేసింది. ఈడీ తరఫున ఎవరూ హాజరుకాకపోవడంతో జగన్ తదితరుల డిశ్ఛార్జి పిటిషన్‌లలో కౌంటర్ల నిమిత్తం విచారణను వాయిదా వేసింది.
శ్రీలక్ష్మి పిటిషన్‌పై వాయిదాకు నిరాకరణ