అదానీ ఎంటర్‌ప్రైజస్, ఎన్‌సీసీఎఫ్(జాతీయ సహకార- వినియోగదారుల సమాఖ్య)మాజీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, నియమాల ఉల్లంఘనపై కేసు నమోదింది. 2010లో ఏపీజెన్‌కోకు బొగ్గు సరఫరాలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలతో కేంద్రం దర్యాప్తు సంస్థ ఈ కేసు పెట్టినట్లు తెలుస్తోంది.
ఏం జరిగింది..?
విజయవాడ నార్ల తాతరావు పవర్ స్టేషన్, కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లకు రైలు మార్గాన 6 లక్షల మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేసేందుకు ఏపీజెన్కో 2010లో టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియలో ఎన్‌సీసీఎఫ్ మాజీ ఛైర్మన్ వీరేంద్ర సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ జీపీ గుప్తా... అదానీ సంస్థకు కాంట్రాక్టు వచ్చేలా వ్యవహరించారని సీబీఐ... వీరిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. బొగ్గు సరఫరాలో అక్రమాలు జరిగాయని వీరేంద్ర సింగ్, గుప్తా, ఇతర అధికారులు, అదానీ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇదీ చదవండి :
ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి రూ.436 కోట్లు విడుదల