ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బెయిల్ షరతులు సడలించొద్దు.. గాలి కేసులో సీబీఐ వాదనలు

ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్ధన్ రెడ్డి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిగింది. బెయిల్ షరతులు సడలించాలని వేసిన పిటిషన్​పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ షరతులు సడలిస్తే.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించింది.

gali janardhana reddy
gali janardhana reddy

By

Published : Nov 16, 2020, 3:48 PM IST

Updated : Nov 16, 2020, 4:10 PM IST

ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో బెయిల్ షరతులు సడలించాలని గాలి జనార్ధన్​రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... గాలి జనార్ధన్​రెడ్డి పిటిషన్​ను వ్యతిరేకించారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున్న బెయిల్ షరతు సడలించొద్దని కోరారు.

మరోవైపు సీబీఐ ట్రయల్ కోర్టు విచారణపై స్టే ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది. అయితే ఈ అంశంలో వివరంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. అలాగే ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సీబీఐని కూడా ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Last Updated : Nov 16, 2020, 4:10 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details