తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీబీఐ ఇన్‌స్పెక్టర్ బి.సతీష్ ప్రభు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యూదిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఈ అవార్డును ప్రభుకు బహుకరించారు.
సతీష్ ప్రభు సీబీఐలోనూ, ఆర్పీఎఫ్‌లోనూ అనేక సంచలన కేసులను పరిశోధించి.. నిందితులకు శిక్ష పడేలా చేశారు. సంచలనం సృష్టించిన అబూ సలేమ్ -మోనికా బేడి కేసును ఈయనే ఛేదించారు. ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ భాగస్వాములపైన అవినీతి కేసులను సాక్ష్యాధారాలతో నిరూపించారు.