SRILAKSHMI OMC CASE: ఐఏఎస్ శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడి... గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓఎంసీకి నిబంధనలకు విరుద్ధంగా లీజులు కట్టబెట్టారని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. గనుల చట్టానికి విరుద్ధంగా సీబీఐ కేసు నమోదు చేసిందంటూ శ్రీలక్ష్మి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. కర్ణాటకలో అక్రమంగా తవ్విన ఖనిజాన్ని తరలించడానికి.. ఏపీలో లీజులు కేటాయించారని సీబీఐ తరఫు న్యాయవాది సురేంద్ర హైకోర్టుకు తెలిపారు. ప్రస్తుత దశలో కేసు కొట్టివేయవద్దని కోరారు. గనుల లీజు కోసం శ్రీలక్ష్మి రూ. 8 లక్షలు డిమాండ్ చేశారని.. కడప జిల్లా గనుల వ్యాపారి శశికుమార్ వాంగ్మూలమిచ్చినట్లు సీబీఐ పేర్కొంది. మైనింగ్ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని, సీబీఐ జోక్యం చేసుకోరాదని...శ్రీలక్ష్మి న్యాయవాది వాదించారు. ఇతర నిందితులతో కలిసి కుట్ర పన్నినట్లు సీబీఐ ఆధారాలు చూపలేదన్నారు.
SRILAKSHMI OMC CASE: శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు: సీబీఐ - ఓఎంసీ కేసు వార్తలు
SRILAKSHMI OMC CASE: ఓఎంసీకి గనులను లీజుకు ఇవ్వడంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి తన అధికారాలను దుర్వినియోగం చేశారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ప్రస్తుత దశలో కేసు కొట్టివేయవద్దని తెలంగాణ హైకోర్టును కోరారు.
SRILAKSHMI OMC CASE