సీఎం జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులపై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇండియా సిమెంట్స్ కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనాలు జరిగాయి. ఛార్జ్‌షీట్ నుంచి తొలగించాలని జగన్ కోరారు. ఇండియా సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌లో విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐకి చివరి అవకాశం ఇచ్చింది.
ఓబుళాపురం గనుల కేసుపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ కేసులో నిందితులపై నమోదైన అభియోగాలపై వాదనలు వినిపించేందుకు సీబీఐ గడువు కోరింది. డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు వినిపించేదుకు ఐఏఎస్ శ్రీలక్ష్మికి చివరి అవకాశం ఇచ్చిన కోర్టు.. ఓఎంసీ కేసు విచారణ వచ్చే నెల 3కు వాయిదా వేసింది.