జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషన్ పై ఈనెల 22న విచారించనుంది.
'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్‌పై.. ఈ నెల 22న సీబీఐ కోర్టు విచారణ! - raghu ram petion in cbicourt
జగన్ బెయిల్ రద్దు పిటిషన్
18:13 April 15
ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం
రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు అభ్యంతరాలపై రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు. చివరికి.. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్టు ఈనెల 22న విచారించాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి:
సీఎం జగన్ బెయిల్ రద్దు చేయండి.. సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ పిటిషన్
Last Updated : Apr 15, 2021, 6:45 PM IST