ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీబీఐ కేసు తర్వాతే ఈడీ కేసు విచారణ చేపట్టాలి :జగన్ కేసులో వాదనలు - జగన్ అక్రమాస్తుల కేసు విచారణ న్యూస్

సీబీఐ కేసు తర్వాతే ఈడీ కేసు విచారణ చేపట్టాలని జగన్ తరపు, తదితరుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. జగతి పబ్లికేషన్స్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి విచారణ చేపట్టారు. సీబీఐ కేసులపై 16కి, ఈడీ కేసుపై విచారణను 17వ తేదీకి వాయిదా వేశారు.

CBI court hears
CBI court hears

By

Published : Nov 13, 2020, 7:57 AM IST

సీబీఐ కేసులు తేలాక వాటి ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసులపై విచారణ చేపట్టాలని జగన్‌, తదితరుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి నిందితులైన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు.

నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి, యు.ఉమామహేశ్వరరావు, జి.అశోక్‌రెడ్డిలు వాదనలు వినిపిస్తూ.. సీబీఐ కేసును కొట్టి వేసినా ఈడీ కేసు విచారణ చేపట్టవచ్చంటూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈడీ ఆధారంగా తీసుకుందన్నారు. అయితే మద్రాస్‌ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసిందని వివరించారు. సీబీఐ కేసు కొట్టివేసిన పక్షంలో దాని ఆధారంగా నమోదైన కేసు ఉనికే ఉండదని పేర్కొన్నారు. సీబీఐ కేసులపై 16కి, ఈడీ కేసుపై విచారణను 17వ తేదీకి వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details