ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లోని రాంకీ ఫార్మా సిటీ ఛార్జ్‌షీట్‌లో డిశ్చార్జ్ పిటిషన్‌పై నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానంలో విజయసాయిరెడ్డి తరఫున వాదనలు జరిగాయి. తనను కేసు నుంచి తొలగించాలని కోరుతూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు అభియోగాల నమోదును కలిపి కోర్టు విచారణ చేపట్టింది. వాదనలు కొనసాగించేందుకు రాంకీ ఫార్మా కేసు విచారణను ఈనెల 11కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, వాన్‌పిక్ ఛార్జ్‌షీట్ల విచారణ కూడా ఈనెల 11కి న్యాయస్థానం వాయిదా వేసింది. లేపాక్షి నాలెడ్జ్‌హబ్ కేసులో హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున విచారణను జులై 2కి వాయిదా వేసింది.
Jagan cases: జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ - జగన్ అక్రమాస్తుల కేసు వార్తలు
జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి, వాన్‌పిక్ కేసుల విచారణ ఈ నెల 11కి వాయిదా వేసింది. రాంకీ కేసులో విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

Jagan disproportionate assets case
Last Updated : Jun 9, 2021, 1:15 AM IST