అక్రమాస్తుల కేసులో జగన్ పిటిషన్లు కొట్టివేసిన సీబీఐ కోర్టు - jagan petition news uopdate
13:22 January 17
అక్రమాస్తుల కేసులో జగన్ పిటిషన్లు కొట్టివేసిన సీబీఐ కోర్టు
అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబీఐ, ఈడీ కోర్టు కొట్టివేసింది. డిశ్చార్జి పిటిషన్లన్నంటినీ కలిపి విచారించాలని గతంలో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కేసుల విచారణ పూర్తైన తర్వాతే ఈడీ కేసుల విచారణ జరపాలని ఆయన మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదనల అనంతరం డిశార్చి పిటిషన్లన్నింటినీ కలిపి వినేందుకు కోర్టు నిరాకరించింది. వేర్వేరుగానే వినాలని న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన 11 అభియోగపత్రాలు... ఈడీ దాఖలు చేసిన ఐదు ఛార్జ్ షీట్లపై విచారణ జరిగింది. ఇవాళ్టి హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది.
పెన్నా కేసు అభియోగ పత్రంపై విచారణ ప్రక్రియను సీబీఐ కోర్టు ప్రారంభించగా...ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఏడుగురికీ అనుబంధ అభియోగపత్రాల పత్రాలను కోర్టు అందజేసింది. అనంతరం అన్ని కేసులపై తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకీ వాయిదా వేసింది.