ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్ పారిస్‌ పర్యటనకు.. సీబీఐ కోర్టు పచ్చజెండా - సీఎం జగన్ పారిస్‌ పర్యటన

CBI Court permission to Jagan: సీఎం జగన్ పారిస్‌ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 28 నుంచి 10రోజులపాటు పారిస్‌ వెళ్లేందుకు అనుమతినిచ్చింది.కేసుల విచారణ జాప్యంలో అవుతుందన్న సీబీఐ అభ్యంతరాలు తోసిపుచ్చిన కోర్టు.. పర్యటన వివరాలను సీబీఐకి, కోర్టుకు సమర్పించాలని జగన్‌ను ఆదేశించింది. పారిస్‌లో చదువుతున్న తన కుమార్తె కాన్వొకేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్‌ సీబీఐ కోర్టును కోరారు.

సీఎం జగన్
సీఎం జగన్

By

Published : Jun 22, 2022, 9:56 PM IST

Jagan Foreign Tour: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పారిస్‌ పర్యటనకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌ వెళ్లేందుకు సీఎం జగన్‌కు న్యాయస్థానం అనుమతినిచ్చింది. జగన్‌ విదేశీ పర్యటనతో కేసుల విచారణలో జాప్యం అవుతుందని సీబీఐ చేసిన అభ్యంతరాలను సీబీఐ న్యాయస్థానం తోసిపుచ్చింది. పర్యటన వివరాలను సీబీఐకి, కోర్టుకు సమర్పించి పారిస్‌ వెళ్లాల్సిందిగా జగన్‌ను సీబీఐ కోర్టు ఆదేశించింది.

సీఎం జగన్‌ పెద్ద కుమార్తె హర్షరెడ్డి పారిస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నారు. పారిస్‌లోని ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో చదువుతున్న హర్షరెడ్డి జులై 2న కాన్వొకేషన్‌ తీసుకోనున్నారు. కుమార్తె కాన్వొకేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్‌ సీబీఐ కోర్టును కోరారు. కుమార్తె కళాశాల స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వీలుగా.. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతును సడలించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈనెల 28 నుంచి వారం పాటు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని జగన్‌ కోర్టును కోరారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసిన సీబీఐ అధికారులు.. జగన్‌ పారిస్‌ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పారిస్‌ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. వివిధ కారణాలు చెప్పి జగన్‌ విదేశాలకు వెళ్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జగన్‌ పారిస్ వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రెండు వైపుల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా పారిస్‌ పర్యటనకు జగన్‌కు అనుమతి ఇచ్చింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details