హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కు చెందిన మణివర్దన్ రెడ్డి, తమిళనాడుకు చెందిన సెల్వం రామరాజు కలిసి... రాయపాటి సాంబశివరావును బెదిరించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఇద్దరిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసిన కేసులో ట్రాన్స్ టాయ్ ఛైర్మన్ రాయపాటి సాంబశివ రావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు నుంచి బయట పడాలంటే డబ్బులు ఇవ్వాలని మణివర్దన్, రామరాజు కలిసి రాయపాటి సాంబశివరావుకు ఫోన్ చేశారు. ఈ నెల 4వ తేదీన రాయపాటిని మణివర్దన్ నేరుగా గుంటూరులో కలిశారు. దీంతో రాయపాటి సాంబశివరావు డబ్బులు ఇవ్వడానికి రెండు రోజుల సమయం కోరారు. అనుమానం వచ్చిన రాయపాటి... నేరుగా దిల్లీలోని సీబీఐ అధికారులకు ఈ నెల16 న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు.... మణివర్దన్, రామరాజు కలిసి గతంలోనూ సీబీఐ అధికారుల పేరిట పలువురిని బెదిరించినట్లు గుర్తించారు.
రాయపాటికి బెదిరింపులు..ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ - cbi cae over rayapati sambashivarao news
సీబీఐ ఉన్నతాధికారులమంటూ.... మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును బెదిరించిన కేసులు ఇద్దరు నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది.
cbi-arrest-fake-cbi-officers-over-rayapati-sambashivarao-case
ఇదీ చదవండి : అబద్ధాలు, సీఎం జగన్ అవిభక్త కవలలు: నారా లోకేష్
TAGGED:
రాయపాటిపై సీబీఐ కేసు