CBI Appeal To Supreme court : గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. షరతులతో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసింది. అక్రమమైనింగ్ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని.. కేసును గాలి జనార్దన్‌రెడ్డి పక్కదోవ పట్టిస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలిపింది. అందువల్ల ఆయనను బళ్లారి నుంచి బయటకు పంపాలని సీబీఐ.. సుప్రీంకోర్టును కోరింది. అక్రమ మైనింగ్ కేసులో ఏ-2గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి.. బళ్లారిలో ఉండేందుకు అనుమతిస్తూ గతేడాది ఆగస్టు 19న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది.
గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి.. - సుప్రీంకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి
17:47 September 15
సాక్షులను బెదిరిస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
అయితే బళ్లారిలో ఉంటున్న గాలి జనార్దన్‌రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారని.. ప్రధాన సాక్షి శ్యామ్‌ప్రసాద్‌కు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయని.. గాలి జనార్దన్‌రెడ్డి నుంచి సందేశం వచ్చిందని అఫిడవిట్‌లో తెలిపింది. రక్షణ కల్పించాలని శ్యామ్ సీబీఐ కోర్టును కోరినట్లు తెలిపింది. మరో సాక్షికి వచ్చిన బెదిరింపులపై పరిశీలిస్తున్నట్లు కోర్టుకి వెల్లడించింది. నిందితులు పదేపదే డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని.. విచారణ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని తెలిపింది.
ఫలితంగా విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని కోర్టు దృష్టికి తెచ్చింది. నిందితుల వ్యవహారం వల్ల కేసుకు నష్టం జరుగుతోందన్న సీబీఐ.. కేసు ముగింపు దశకు చేరకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో జాప్యం లేకుండా డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ముగించాలని.. రోజువారీ పద్ధతిలో విచారణ జరిగేలా కింది కోర్టులను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. అభియోగాల నమోదుకు నిర్దిష్ట గడువు విధించాలంది. బళ్లారిలో ఉండేందుకు గాలి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చాలని కోరింది.
ఇవీ చదవండి: