CAT Fires on TS CS: ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని రెండు వారాల్లో విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఆదేశించింది. సీఎస్ సోమేశ్ కుమార్‌పై అభిషేక్ మొహంతి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ట్రైబ్యునల్ ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. అధికారుల విభజనలో భాగంగా అభిషేక్ మొహంతిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. కేటాయింపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అభిషేక్ మొహంతి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.
ఎనిమిది నెలలు అయినా..
విచారణ జరిపిన క్యాట్... అభిషేక్ మొహంతిని రిలీవ్ చేయాలని ఏపీకి.. విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణను ఎనిమిది నెలల క్రితం ఆదేశించింది. క్యాట్ ఆదేశాల మేరకు అభిషేక్‌ను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం తనను విధుల్లోకి తీసుకోవడం లేదంటూ సీఎస్ సోమేశ్ కుమార్‌పై అభిషేక్ మొహంతి క్యాట్‌లో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. గతంలో విచారణ జరిపిన క్యాట్.. ఇవాళ హాజరు కావాలని సోమేష్ కుమార్ ఆదేశించింది.