ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీలో ప్రజాప్రతినిధులపై 132 కేసులు పెండింగ్ - ఏపీలో ప్రజాప్రతినుధులపై 132 కేసులు పెండింగ్

ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణకు వివిధ రాష్ట్రాల హైకోర్టులు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా కార్యాచరణ ప్రణాళికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఏపీలోని విజయవాడలోని ప్రత్యేక కోర్టులో ప్రజాప్రతినిధులపై మొత్తం 132 కేసులు పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు.

court
court

By

Published : Oct 5, 2020, 2:32 PM IST

ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణకు వివిధ రాష్ట్రాల హైకోర్టులు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. కార్యాచరణ ప్రణాళికను సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పించారు. దేశవ్యాప్తంగా 4,859 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఏపీలోని విజయవాడలోని ప్రత్యేక కోర్టులో ప్రజాప్రతినిధులపై మొత్తం 132 కేసులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. 10 సెషన్స్ కోర్టులో ఉండగా మరో 122 కేసులు మేజిస్ట్రేట్ స్థాయి కోర్టులో ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఒక మేజిస్ట్రేట్ కోర్టును ప్రత్యేక కోర్టుగా గుర్తిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. సెషన్స్ స్థాయి ప్రత్యేక కోర్టులను విశాఖ, కడపలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

ప్రత్యేక కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ.. ప్రాధాన్యత క్రమంలో లేదా సాధారణ విచారణా? అనే అంశంపై ఏపీ హైకోర్టు స్పష్టత కోరింది.

ఇదీ చదవండి:పోలీసుల ఉదాసీనత వల్లే రాజ్యాంగ ఉల్లంఘనలు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details