ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లో శిక్షలు 10 శాతం లోపే

మహిళలపై నేరాలను పోలీసులు న్యాయస్థానాల్లో నిరూపించలేకపోతున్నారు. అతివలపై అకృత్యాలకు పాల్పడినవారికి శిక్షలు పడేలా చేయటంలో విఫలమవుతున్నారు. వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టలేకపోతున్నారు. వినటానికి చేదుగా ఉన్నా.. ఇది పచ్చినిజం. రాష్ట్రంలో నేరనిరూపణ అతిపెద్ద సమస్యగా మారింది. ఈ తరహా నేరాల్లో న్యాయస్థానాల్లో విచారణ పూర్తయిన ప్రతి వంద కేసుల్లో 90కి పైగా వీగిపోతున్నాయి.

cases for Telugu states
cases for Telugu states

By

Published : Dec 2, 2019, 7:58 AM IST

జాతీయస్థాయిలో మహిళలపై అత్యాచారాల విషయంలో1,46,201కేసుల్లో విచారణ చేపట్టగా..కేవలం5,882కేసుల్లోనే శిక్షలు పడ్డాయి.అంటే శిక్షల శాతం3.98మాత్రమే!మహిళలపై జరిగే అన్నిరకాల నేరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి దాదాపు8,500-9,500వరకూ కేసుల విచారణ న్యాయస్థానాల్లో పూర్తవుతుంది.కానీ వెయ్యి కేసుల్లోనైనా శిక్షలు పడట్లేదు. 2014-17మధ్య గణాంకాలు విశ్లేషిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది.

ఏదైనా కేసులో నేరస్థుడికి శిక్షపడాలంటే కేసు నమోదు,దర్యాప్తు,ఆధారాల సేకరణ,సాక్ష్యాలను పకడ్బందీగా న్యాయస్థానానికి సమర్పించటం,నేరం నిరూపితమయ్యేలా వాదించటం కీలకం.వీటిపైనే ఆ కేసు భవితవ్యం ఆధారపడి ఉంటుంది.వీటిలో ఏ ఒక్కదాంట్లో చిన్నతేడా వచ్చినా కేసు వీగిపోయే అవకాశాలు ఎక్కువ.చాలాకేసుల్లో మొదట్లో హడావుడి తప్ప..నేరాన్ని నిరూపించేలా దర్యాప్తు జరగట్లేదు.అభియోగపత్రాల నాణ్యత అంతంతగానే ఉండటంతో దాని ప్రభావం న్యాయస్థానాల్లో కేసు విచారణపై పడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో శిక్షలు 10 శాతం లోపే

దోషులెవరు?

ఆయేషా మీరా హత్యకేసు ఎంత సంచలనం కలిగించిందో తెలిసిందే.ఈ కేసులో పోలీసు దర్యాప్తు సక్రమంగా లేదని,కనీస జాగ్రత్తలు పాటించలేదని న్యాయస్థానం పోలీసులను తప్పుబట్టింది.ఈ కేసులో నిందితుడైన సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది.అంతకుముందు అతనికి జీవితఖైదు విధిస్తూ దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రద్దుచేసింది.ఏళ్లు గడుస్తున్నా ఈ కేసులో దోషులెవరో తేలలేదు.ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తుచేస్తోంది.

(కొన్నేళ్ల క్రితం విజయవాడ పటమట పోలీసుస్టేషన్‌ పరిధిలో హిమబిందు అనే వివాహిత హత్యకు గురయ్యారు.ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టుచేసినా..వారే నేరం చేసినట్లు నిరూపించేందుకు తగిన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టలేకపోవటంతో కోర్టులో ఈ కేసు వీగిపోయింది.పోలీసుల వైఫల్యంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తంచేసింది.ఈ కేసులో దోషులెవరో ఇప్పటికీ తేలలేదు.)

ప్రధాన కారణాలివే!

  • చాలా సందర్భాల్లో పోలీసుల నుంచి సత్వర స్పందన కొరవడటం
  • నేరం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకోలేకపోవటం,ఆధారాల సేకరణలో ఉదాసీనత
  • దర్యాప్తులో నాణ్యత క్షీణించటం,క్షేత్రస్థాయి దర్యాప్తునకు ప్రాధాన్యమివ్వకపోవటం
  • ఓ కేసు దర్యాప్తులో ఉండగానే..కొత్త కేసుల బాధ్యతలు మీద పడటంతో పాతవాటిపై శ్రద్ధ చూపలేకపోవటం
  • క్షేత్రస్థాయిలో బందోబస్తు,నేరపరిశోధన బాధ్యతలు ఒకరే నిర్వహించాల్సి రావడం
  • పరువు పోతుందన్న భయంతో బాధితులు ముందుకు రాకపోవటం
  • కొన్ని కేసుల్లో రకరకాల ఒత్తిళ్లతో పరస్పరం రాజీ
  • సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ ముందుకు రాకపోవటం
  • సాక్ష్యం చెబితే నేరగాళ్ల నుంచి ముప్పు భయం,న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భావన
  • మహిళలపై నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో విచారణ పూర్తవుతున్న ప్రతి వందకేసుల్లో75వీగిపోతున్నాయి. 25కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి.
  • ఈ తరహా నేరాల్లో జాతీయస్థాయి శిక్షల రేటు కంటే కూడా ఏపీ,తెలంగాణల్లో శిక్షల రేటు చాలా తక్కువగా ఉంది.
  • మహిళలపై జరిగిన నేరాలకు అతి తక్కువ శిక్షలు పడిన రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్‌10.3%తో8వ స్థానంలో ఉంది.ఈ విషయంలో3.1%తో గుజరాత్‌ మొదటిస్థానంలోనూ, 3.2%తో పశ్చిమబెంగాల్‌ రెండోస్థానంలోనూ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

గుంటూరు జీజీహెచ్​లో నూతన పథకం...ఇవాళ ప్రారంభించనున్న సీఎం

ABOUT THE AUTHOR

...view details