ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజధాని రైతులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు

By

Published : Mar 9, 2021, 2:55 PM IST

మహిళా దినోత్సవం రోజు జరిగిన ఆందోళనలకు సంబంధించి రాజధాని రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కొంత మంది మహిళలు, రైతుల పేర్లను ఎఫ్​ఐఆర్​లో చేర్చారు.

Case registration under IPC sections
రాజధాని రైతులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు

మహిళా దినోత్సవం రోజు రాజధాని ప్రాంత మహిళలు, రైతులు ప్రకాశం బ్యారేజీపై నిరసనకు బయలుదేరారు. అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేపట్టారు. ముఖ్యంగా మందడం, మల్కాపురం ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి.

రైతులు వెలగపూడిలోని సచివాలయం వైపు వెళ్లేందుకు యత్నించారు. అక్కడ జరిగిన ఆందోళనలకు సంబంధించి ఐపీసీ 143, 188, 332 353, 506, 509, R/W 149 సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఆందోళనకు సంబంధించి పదిహేడు మంది పేర్లను ఎఫ్.ఐ.ఆర్​లో చేర్చారు.

ఇదీ చదవండి:అమరావతి మహిళలను పరామర్శించనున్న చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details