స్థల వివాదంలో ప్రముఖ సినీ నిర్మాత సి కళ్యాణ్(C Kalyan)పై హైదరాబాదులో కేసు నమోదైంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ వైద్యుడు స్వరూప్... 1985లో షేక్‌పేటలో ఉన్న 634గజాల స్థలాన్ని... ఫిలింనగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుంచి కొనుగోలు చేశాడు. అనంతరం తన సోదరుడు గోపీకృష్ణ పేరుతో జీపీఏ(GPA) చేయించాడు. ఈ స్థలాన్ని 2015లో నారాయణ మూర్తి అనే వ్యక్తికి అద్దెకు ఇవ్వగా.. అక్కడ ఆర్గానిక్ స్టోర్ నిర్వహిస్తున్నారు.
C Kalyan: స్థల వివాదంలో ప్రముఖ సినీ నిర్మాత సి.కళ్యాణ్... హైదరాబాద్‌లో కేసు నమోదు - తెలంగాణ వార్తలు
ప్రముఖ సినీ నిర్మాత సి కళ్యాణ్(C Kalyan)తో పాటు మరో ముగ్గురిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ ప్రవాస భారతీయ వైద్యునికి చెందిన స్థలాన్ని ఆక్రమించారని... గోపీకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
producer
ఈ క్రమంలో శ్రీకాంత్, తేజస్వీ, షరీఫ్ అనే ముగ్గరు అక్రమంగా ప్రవేశించి దానికి తాళాలు వేశారు. సినీ నిర్మాత కళ్యాణ్ సూచనల మేరకే ఈ పని చేసినట్లు ఆ ముగ్గురు తెలిపారని.. గోపీకృష్ణ బంజారాహిల్స్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో వివరించారు. పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా..తప్పుడు కేసులపైనే దృష్టి: చంద్రబాబు