ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సచివాలయానికి 30 శాతం ఉద్యోగులే హాజరు - సచివాలయంపై కరోనా ఎఫెక్ట్​ న్యూస్

కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయానికి ఉద్యోగులు 30 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. ఉద్యోగులు , సందర్శకులు లేకపోవటంతో సచివాలయ ప్రాంగణం, విభాగాలన్నీ బోసిపోయాయి.

carona effect in sachivalayam
carona effect in sachivalayam

By

Published : Mar 23, 2020, 2:30 PM IST

కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కొంతమంది ఉద్యోగులే సచివాలయానికి హాజరయ్యారు. 30 శాతం మంది ఉద్యోగులు మాత్రమే రావడంతో.. సచివాలయం వెలవెలబోయింది. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా బ్లాక్‌లు అన్ని ఖాళీగా ఉన్నాయి. సందర్శకులకు అనుమతి లేదని సచివాలయం వెలుపల బోర్డులు పెట్టారు. హైదరాబాద్ నుంచి రావాల్సిన సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజా రవాణా, ఆర్టీసీ బస్సులు నిలిపివేయటంతో పరిమిత సంఖ్యలో ఉద్యోగులూ సొంత వాహనాలపైనే హాజరవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details