రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 261 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,92,269కి చేరింది. కొత్తగా వైరస్ కారణంగా ఎవరూ మృతి చెందలేదు. ఇప్పటివరకు 7,185 మంది వైరస్‌కు బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో కొత్తగా 261 కరోనా కేసులు నమోదు - ఆంధ్రలో తాజాగా కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 261 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా కొత్తగా ఎవరూ మృతి చెందలేదని వైద్య అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా కేసులు..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 125 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,83,505కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,579 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా గుంటూరులో 41 కేసులు నమోదయ్యాయి. అయితే విజయనగరంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ..శేషాచలం అడవుల్లో మంటలు.. పట్టించుకోని అధికారులు