Banjara hills Accident Today: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన అయోధ్యరాయ్, దేబంద్ర కుమార్ విధులు ముగించుకుని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో నడుచుకుంటూ వెళ్తున్నారు. కొద్దిసేపట్లో వారి గదికి చేరుకునే వారు. కానీ వారిని కారు రూపంలో మృత్యువు వెంబడించింది.
రోడ్ నంబర్-2లో అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అయోధ్యరాయ్, దేబంద్రకుమార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు బంజాహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.