ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒక్కసారిగా కారులో చెలరేగిన మంటలు..ఆ తర్వాత.. - గూడూరు టోల్‌ప్లాజా వద్ద కారులో మంటలు

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కారు ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమై కారులో ఉన్నవారు కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది.

car-fires-at-gudur-toll-plaza
అగ్ని ప్రమాదం

By

Published : Sep 29, 2021, 10:11 PM IST

అకస్మాత్తుగా కారులో మంటలు..

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కారు ప్రమాదం జరిగింది. బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద కారులో (Car fire at toll plaza) అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రేనాల్ట్ లార్జ్ కారు వరంగల్ నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. టోల్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలు ఆర్పినట్లు టోల్ ప్లాజా (Car fire at toll plaza) మేనేజర్ సుధీర్ తెలిపారు. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరు బయటికి వచ్చేశారు. వారికి ఏమీ కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details