ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాగర్‌ ఎడమ కాలువలో కొట్టుకుపోతున్న కారు.. - సాగర్ కాలువ వార్తలు

Car Fell Down in Sagar Canal: నాగార్జునసాగర్‌ ఎడమ కాలువలో కారు కొట్టుకుపోవడం కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు కారును కాలువలోకి తోసి వెళ్లినట్లుగా ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని చోటుచేసుకుంది.

car fell down in sagar left canal
car fell down in sagar left canal

By

Published : Mar 18, 2022, 9:24 PM IST

సాగర్‌ ఎడమ కాలువలో కొట్టుకుపోతున్న కారు..

Car Fell Down in Sagar Canal: తెలంగాణలోని నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద సాగర్ ఎడమ కాలువలో హోండా సిటీ కారు కొట్టుకొచ్చింది. ఎడమ కాలువలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నీటిలో పడవ మాదిరిగా కారు నీటిలో వెళ్తోంది. ఇద్దరు వ్యక్తులు కారును కాలువ కట్ట మీద నుంచి నీటిలోకి తోసివేసినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు.

నీటి ప్రవాహంలో కొట్టుకొస్తున్న కారు కనపడటంతో వేములపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. కారులో ఎవరు లేరని తెలిపారు. కారుని నీటిలో తోయడానికి గల కారణాలు ఏంటి? ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది? అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఇదీ చదవండి:కారు బీభత్సం.. పసికందు మృతి.. వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్​..!

ABOUT THE AUTHOR

...view details